టీడీపీ కార్యాలయంపై దాడి కేసు.. వైసీపీ నేతలకు షాక్! సుప్రీంకోర్టులో తీవ్ర నిరాశ..
Fri Jan 31, 2025 19:06 Politicsగన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో వైసీపీ నేతలు గతంలో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, కింది కోర్టుకు వెళ్లాలని ఆదేశిస్తూ, వారి బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దాంతో, హైకోర్టు ఉత్తర్వులపై 33 మంది నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం.. ఈ కేసులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
ఇంకా చదవండి: చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్ పోస్టులపై చర్చ!
హైకోర్టు చెప్పినట్టే నిందితులు ట్రయల్ కోర్టుకు వెళ్లాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. అయితే వైసీపీ నేతలకు కొద్ది మేరకు ఊరట కలిగిస్తూ... ట్రయల్ కోర్టుకు వెళ్లేందుకు రెండు వారాల గడువు ఇచ్చింది. రెండు వారాల వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు మెరిట్స్ లోకి తాము వెళ్లడం లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్ వెల్లడించారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. వంశీపైనా ఆరోపణలు ఉండడంతో ఆయన కూడా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్ పోస్టులపై చర్చ!
టీడీపీ కార్యాలయంలో కోపగించుకున్న లోకేష్! ప్రోటోకాల్ పేరుతో పోలీసుల అత్యుత్సాహం!
టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి! ఎవరంటే!
ఏపీ ప్రజలకు అలర్ట్ - ఫిబ్రవరి 1 నుంచి కొత్త ఛార్జీలు! రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద రద్దీ!
మద్యం ప్రియులకు మరో అదిరే శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! ఫిబ్రవరి 7న లాటరీ పద్ధతిలో..
మరో కీలక నిర్ణయం.. పెన్షన్ తీసుకునే వారికి అలర్ట్.. ఈ కొత్త అప్‌డేట్ మీకోసమే, మిస్ అవ్వొద్దు!
చంద్రబాబు మరో కీలక నిర్ణయం.. ఆ భూములు అన్నీ వారికే ఇక.. ప్రభుత్వం కొత్త చట్టం!
భూముల ధరల పెరుగుదలతో కార్యాలయాల్లో భారీ రద్దీ! సర్వర్లు డౌన్ కారణంగా ఆటంకం!
దేశంలోనే ఫస్ట్ టైమ్ ఏపీలో.. 'మన మిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు!
ఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి నుంచి ఆ యూపీఐ పేమెంట్స్ పనిచేయవు.. కారణమిదే!
ఘోర ప్రమాదం.. ఆకాశంలో ఢీ కొన్న విమానాలు.. విమానాశ్రయాన్ని మూసివేసిన అధికారులు!
భక్తుడి ఫిర్యాదు.. మంత్రి లోకేష్ సీరియస్ రియాక్షన్.. 24 గంటల్లోనే చర్యలు!
జనవరి 1 నుంచే ఆర్థిక సంవత్సరం? టాక్స్‌పేయర్లకు లాభామా? నష్టమా?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Gannavaram #TDPOffice #Attack #SupremeCourt #YSRCP
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.